అబ్బబ్బ అసలు ఏంటీ వర్షం, ఏంటీ లొకం?
హిహిహి....మళ్ళీ మొదలెట్టాను అనుకుంటున్నారు కదూ? ఏం చేస్తాం చెప్పండి, వర్షా కాలం కదా...:)
అసలు ఈ పొస్ట్ మొన్నsatday రాద్దాం అనుకున్నా కానీ బద్దకంగా అనిపించి రాయలేదు. కానీ ఈ రోజు రాయాల్సిన పరిస్థితి వఛ్ఛింది కాబట్టి రాస్తున్నా, ఎందుకు అంటారా?? అక్కడికే వస్తున్నా.
మొన్న శనివారం ఆఫీస్ నుండి ఇంటికి వెళ్దాం అని బయల్దేరానా, ఫుల్ వర్షం. అయితే నాకేంటి, మొన్న తెచ్చి ఆఫీస్ లో మర్చిపోయిన గొడుగు ఉందిగా..ఇంకేం, ఉత్సాహం గా బయల్దేరా..
రోడ్ మీదకి వచ్చేసరికి కొంచెం తగ్గింది. ఏంటో జనాలు..అందరికీ ఒకేసారి ఏం అవసరం వచ్చి పడిందో తెలీదు కానీ ఒకటే ఉరుకులు, పరుగులు. నేను ఏదో నా మానాన నేను నెమ్మదిగా వెళ్తున్నానా?? ఒకరు తోసుకుని వెళ్లిపోతారు, ఇంకొకరు కాళ్లు తొక్కేస్తున్నారు..హు.. మా తొక్కలో శ్రీనగర్ కాలనీ లొ బస్సులు దొరికి చావవు కదా..సరే అని ఆటో ఎక్కుదాం అని అడిగితే అతను ఏంటో దీర్ఘంగా అలోచిస్తున్నాడు ఇలా పని కాదులే అని నడవడం మొదలు పెట్టాను. ఆ పది నిమిషాల నడకలో కనీసం ఒక పది మంది కాళ్లు తొక్కి ఉంటారు. అసలే వర్షం లొ నానిపోయి ఉండనా, ఊడనా అన్నట్టు ఉన్నాయి నా చెప్పులు. అలానే లాక్కుంటూ సిగ్నల్ దగ్గరకి వచ్చేసరికి అక్కడే ఉన్న సిగ్నల్ కానీస్టబుల్ కూడా కాలు తొక్కేసాడు. ఇంక ఒక్కరు తొక్కినా, ఇంక నాలుగు అడుగులు ఎక్కువ వేసినా అవి ఫటక్ అనడం ఖాయం. జాగ్రత్తగా అడుగు లో అడుగు వేసుకుంటూ వెళ్తుంటే దారిన పొయే ప్రతీ వాహనం నా మీద నీళ్లు కొట్టేవే..ఛీ ఛీ..పైనుండి నీళ్ళు పడకుండా గొడుగు వేసుకున్నాను కానీ ఈ వాహనాల నుండి తప్పించుకోవడానికి లేకుండా పోయింది రా దేవుడా..
ఏదో అంటారు కదా..స్వర్గానికి, భూలోకానికి మధ్య త్రిశంకు స్వర్గం లాంటింది అనీ...అది గుర్తుకు వచ్చింది నాకు. ఒక పక్క మంచి వెదర్, చల్లని గాలి, ఇంటికి వెళ్ళి బుడంకాయలతో ఆడుకోవచ్చు అనే ఆనందం, నెక్స్ట్ 2 డేస్ మంచిగా హాలీడేస్ అనే ఉత్సాహం. ఇంకో పక్క తెగిపోతా అని బెదిరిస్తున్నచెప్పు, అటు పొతూ ఇటు పొతూ నీళ్ళు చిందిస్తున్న వాహనాలు, బస్ దొరుకుతుందా లేదా అనే అదుర్దా, వర్షం పడి ఆగింది కదా ట్రాఫిక్ జాం అయితే ఎలా అనే బెంగ, ఇంకా ఇంకా వర్షం ఎక్కువ అయితే ఇంటికి ఎలా వెళ్ళాలీ అనే టెన్షన్ ఇలా నాకు స్వర్గానికి, నరకానికి మధ్యలొ త్రిశంకు లోకం కనిపించింది. అదీ సంగతి.
ఇక పోతే ఈ రోజే ఎందుకు రాయల్సి వచ్చింది అని అడుగుతున్నారా..చెప్తా..అదీ చెప్తా..నార్మల్ గా పాట్నీ నుండి పంజాగుట్ట రావడానికి ఎక్కువ లో ఎక్కువ వేసుకుంటే అరగంట పట్టాలి, కానీ ఈ రోజు వర్షం వలన 2 గంటలు పట్టింది. నేను 10:15కి బస్ ఎక్కితే 12:15కి ఆఫేస్ కి వచ్చాను, 11కి ఉన్న మీటింగ్ మిస్స్ కొట్టాను:( నేను జనరల్ గానే మీటింగ్స్ కి లేటు అవుతూ ఉంటాను, ఇక ఇప్పుడు రీజన్ ఇదీ అని చెప్పినా ఎవ్వరూ అర్ధం చేసుకోరు. ఎక్కడో చోట చెప్పుకోకపొతె నా బాధ తీరదు అందుకే ఇప్పుడు, ఇక్కడ, ఇలా...
3 comments:
Haha.. finally a post in Telugu.. keep it coming Renu. I hope you liked putting it in Telugu. (ironical that I should comment in English :p)
yes bindu...really liked it in telugu, however, its little time taking at this point of time...may be if i write more..i will get used to :)
Ya Renu... just needs getting a little used to. But atleast you were not lazy, there were no spelling mistakes at all :)
I used to take time initially, but now I can type as quickly as I type English... only difference is I listen to the sounds of the words in my head before I type in Telugu (helps me decide whether to write 'a' or 'A'). If I'm typing in English, I just listen to my thoughts (I wish it were the other way round :)). Perhaps a useful tip for you.
Post a Comment