About Me

My photo
Stubborn but considerative... Sensitive but Sensible enough.. Childish but Caring... Over all, I'm me, truly, rightly, strictly, genuinely ME!

Friday, May 6, 2011

నేను ఏడుస్తున్నా.....

ప్లీజ్..ఈ అమ్మాయి ఎప్పుడు రాసినా ఏవో ఒక issues రాస్తుంది అని తిట్టుకోవద్దు..ఏం చేస్తాం..మనసు స్పందిస్తేనే బ్లాగ్ లో రాయాలి అనుకుంటాను...అది ఈ మద్య అన్నీ wrong issues కే స్పందిస్తుంది....నన్ను తిట్టుకోవద్దు ప్లీజ్.

మొన్న satday ఒక ఫంక్షన్ కి వెళ్ళాం, అది మా శ్రీవారి స్నేహితుల బృందంలో వాళ్ళ అబ్బాయి పుట్టిన రోజు. చాలా రోజులకి కలిసారేమో (అంటే 1wk -10 days కి అన్నమాట), వాళ్ళకి చాలాసేపు కలిసి గడపాలి అనిపించి మా అడాల్లందరినీ ఒక పక్కన వదిలేసి వాళ్ళు రాత్రి 11 దాకా ఎంజాయ్ చేసారు. పాపం, ఇంకా త్రుప్తి కలగలేదు అనుకుంటా..మమ్మల్ని అక్కడ ఓవర్ నైట్ స్టే కి propose చేసారు...అది కూడా ఎలా...సింపుల్ గా ఫోన్లో అత్తయ్య నెంబర్ ఆల్రెడీ dial చేసి అందరి మధ్యలో చేతికి ఇచ్చి తాళం వేసుకోమని చెప్పు అని. మనసులో తిట్టుకుంటూ, పక్కకి వస్తే లాగి రెండు తగిలిద్దాం అని గొణుక్కుంటూ(ఏం చేస్తాం, 2 weeks నుంచి రెస్ట్ లేదు అస్సలు, సండే మొత్తం రిలాక్స్ అయిపోదాం అని ఎన్నెన్నో ప్లాన్స్ తో ఉన్నా) అత్తయ్య కి చెప్పేసాను తాళం వేసుకోండి, మేము ఇంటికి రావట్లేదు అని. ఇంకా మా లేడీస్ బ్యాచ్ అంతా రూంలోకి దూరి లేడీస్ క్లబ్ పెట్టాం. నైట్ 1 అయ్యింది. మళ్ళీ ఈ gents బ్యాచ్ వచ్చి మేము వెళ్తున్నాం...మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి పొద్దున్నే వస్తాం అని చెప్పి అందరూ కలిసి వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయారు...అసలు వీళ్ళు కలిస్తే ఆపలేం కదా అని ముద్దు ముద్దు గా విసుక్కుంటూ(అప్పటికి కోపం తగ్గిపోయింది, మంచి కబుర్లలో పడ్డాం మరి) ఆహా...భలే మంచి రోజు అని పాటలు పాడుకుంటూ మేము ఇంకో గంట అచ్చమయిన ఆడాళ్ళ కబుర్లు చెప్పుకుని పడుకున్నాం. ఆహా...ఇంత చక్కగా ఎంజాయ్ చేసి issue అంటున్దేంటి ఈ పిచ్చి పిల్ల...మాకే గనక ఇలా మొగుళ్ళని వదిలేసి కబుర్లు చెప్పుకునే ఛాన్స్ వస్తే ఎగిరి గంతేసే వాళ్ళం అనుకుంటున్నారు కదా...ఇక్కడ ఉంది ఒక ట్విస్ట్.

రాత్రి పడుకునేటప్పుడు ఒంటి మీద ఉన్న నగలు అన్నీ తీసి మా ఫ్రెండ్ కి ఇచ్చి లోపల పెట్టమన్నాం, తను అలానే పెట్టింది. నెక్స్ట్ డే, వీళ్ళు మంచిగా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి ఈ ఇంట్లో ఉన్నవాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి కొంచెం దించేయ్యరా మా వాళ్ళని అని చెప్పారు. పాపం ఆ అన్నయ్య ఏమో సరే వెళ్దామా అమ్మా...అని అడగ్గానే మేము ఇద్దరం నైటీస్ నుంచి శారీస్ లోకి షిఫ్ట్ అయిపోయి, పిల్లలు ఏమో అక్కడ ఉన్న పిల్లల డ్రెస్లు వేసుకుని ఉన్నారు, వాళ్ళని అలాగే బయల్దేరదీసాం. మా ఇద్దరి నగలు విడి విడి kerchiefs లో పెట్టి ఉన్నవి తీసి ఒంటి మీద వేసుకునేవి వేసుకుని, మిగిలినవి అన్నీ ఒకే kerchief లో సర్దేసుకుని బయల్దేరాం. మా ఇంటికి కొంచెం ముందు ఆ అమ్మాయిని దించేటప్పుడు తన చంద్రహారం నా kerchief లోనుంచి తీసి తనకి ఇచ్చేసా. మిగిలినవి అల్లానే wrap  చేసి ఇంటికి వచ్చాక లోపల పెట్టేసా. అప్పటికే మా సారు చికెన్ తెచ్చి పెట్టి ఉంచారు, అది వండడం మొదలుపెట్టా. మమ్మల్ని దించడానికి ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా వచ్చింది, అది మా ఇంట్లో ఉంటాను అని గొడవ పెడితే సర్లెండి ఒక 2 డేస్ ఉంటుందిలెండి సంజు కి కూడా holidays కదా అని చెప్పి తనని కూడా ఉంచేసా...ఇంకా వాళ్ళకి అన్నం పెట్టి, ఆటలు ఆడీ..కొంచెం సేపు పడుకుని లేచి, వాళ్ళ ఇద్దరికీ ఫ్రెంచ్ fries చేసి పెట్టి, స్నానాల గొడవ అయ్యేసరికి సాయంత్రం అయిపొయింది, ఇంక ఆ పాపని తీసుకుని వెళ్ళడానికి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చేసారు (తను ఎక్కడా నైట్ ఉండదు అంట). ఎలానూ టైంకి వచ్చారు కదా...కొంచెం సేపు ఉండి డిన్నర్ చేసి వెళ్ళమంటే ఉన్నారు....ఈ హడావిడిలో నగల సంగతి కొంచెం కూడా గుర్తు లేదు.




తర్వాతి రోజు ఆఫీసు కి బయల్దేరుతూ ఆ సెట్ పౌచ్ లో సర్దేస్తే లాకర్ లో పెడతారు కదా అని kerchief తెరిచి చూస్తే వా...వా.. వా..ఒక పోగు లేదు :(. వెంటనే ఫ్రెండ్ కి ఫోన్ చేశా..చంద్రహారం తో కలిసి వెళ్లి ఉంటుంది అని...లేదంట ..చిట్టి వెంటనే వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసారు vehicle లో ఉందేమో చూడమని...అప్పటికే vehicle క్లీన్ చేసే అబ్బాయి వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోయాడు అంట. అయినా సరే మాట్స్ అన్నీ తీసి చూసారు కానీ ఎక్కడా లేదు, ఎక్కడ ఉంటుంది ఆల్రెడీ 24hrs అయిపోయింది ఎక్కడో పడిపోయి...ఇంత సేపు ఎలా ఉంటుంది?


మొత్తానికి లేడీస్ నైట్ అవుట్ కాదు కానీ...ఒక నెక్లస్ సెట్ లో పోగు పోయింది. hmm ..ఆ సెట్ లో నెక్లస్ కన్నా పోగులే గ్రాండ్ గా...చాలా బాగుంటాయి...అదీ సంగతి.


నాకు తెలుసు మీరు ఏమి అడుగుతారూ అనేది...మీ వారి రియాక్షన్ ఏంటి అనేగా???? ఏముంది...షరా మామూలే...నీకు జాగ్రత్త లేదు, డబ్బులు వేల్యూ తెలీదు, ఏది ఎలా దాయాలో తెలీదు, ఇంటికి రాగానే ఒక్క నిమిషం పడుతుంది గోల్డ్ తీసి పౌచ్ లో పెట్టడానికి..అదేదో అప్పుడే చూసుకుంటే వెంటనే vechicle లో వెతికేవాళ్ళం, తప్పకుండా దొరికేది...ఇంకో 5 - 6 సం"ల దాకా నన్ను గోల్డ్ కొనమని అడగకు, ఉన్న గోల్డ్ లాకర్ లో నుంచి తెమ్మని అడగకు.....నీకు జాగ్రత్త తెలిసాకే ఏమన్నా...అని కడుపు నిండా ఫుల్ మీల్స్ పెట్టారు....అవన్నీ నాకెప్పుడు తెలియాలి...ఈయన అత్యాశ కాకపోతే...


నేను ఏంటో అన్నీ ఈజీ గా తీసుకుంటాను...ఎందుకు పోతుందిలే అని ధీమా, తీరా పోయాక అయ్యో...కొంచెం జాగ్రత్తగా ఉంటే పోయేది కాదు కదా అని బాధ పడతాను...ఇలా బాధ పడుతున్నాను అని చెప్పాను అనుకోండి...పోయేముందు ఉండాలి ఆ ఏడుపు ఏదో... పోయాక ఎంత ఏడిస్తే మాత్రం ఏం వస్తుంది అని మళ్ళీ రివర్స్లో నాకే పడతాయి...నాకు అవసరమా ఇదంతా??...ఏం చెప్పినా ఓకే ఓకే అని తల ఊపేశాను అనుకోండి  కొంతలో కొంత నయం...ఆ ఏడవాలనుకున్న ఏడుపు ఏదో నాకంటూ ఒక బ్లాగ్ ఉందిగా ఇక్కడ ఏడిస్తే ఏ గొడవ ఉండదు.

2 comments:

Sree said...

ayyo renu..did you finally find it...

i know how it is.. nenu kooda ante ekkadiki poyina edokati paaresukundaaraanu... simple solution anduke assalu emi pettukonu.. maa amma peeda padaleka medalo oka chain, chevuluki pogulu tappa.. :).

Renuka said...

ledu sree...dorakaledu :(

i tell you...we had fun that night like anything and next day...this. hmm..em chestham :(

nenu ippudu sanju ki ade follow avuthunnanu sree...ekkadiki vellina annee fancy & trendy items vesi vadilesthe edgy ganoo untundi, inka safe ga kooda...