About Me

My photo
Stubborn but considerative... Sensitive but Sensible enough.. Childish but Caring... Over all, I'm me, truly, rightly, strictly, genuinely ME!

Thursday, August 5, 2010

లోకం తీరు...

ఇది బహుశా అన్ వెల్ సీజన్ అనుకుంటా.. నాకు ఒక 20 రోజుల నుండీ పొట్టలో కొంచెం నొప్పి గా అనిపిస్తుంది, సర్లే అదే తగ్గిపోతుందిలే అని వదిలేస్తే పెరగట్లేదు కానీ తగ్గట్లేదు కూడా.
ఇక చూస్తే Sanju కి నిన్నట్నుంచీ fever. మామూలుగా అయితే మందు వెయ్యగానే తగ్గిపోతుంది కానీ ఈ సారి అస్సలు తగ్గలేదు. బాగా ఎక్కువగా ఉంటే ఈ రోజు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాను. వైరల్ fever అంట. పని లో పని గా నేను కూడా చూపించుకున్నాను. వాటర్ infection అంట..మా కాలనీ లో బాగా ఉంది అంట అది. నేను కాలనీలో వాటర్ ఎప్పుడు తాగాను అబ్బా? ఆఫీసులో ఎలానూ మినరల్ వాటర్, ఇంక ఇంట్లో కూడా సంజు పుట్టిన దగ్గర్నుంచీ మినరల్ వాటరు తాగడమే అలవాటు చేసుకున్నాం. hmm ..ఏంటో...

ఈ హాస్పిటల్ పని లో పడి ఆఫీసు కి హాఫ్ డే వచ్చాను, ఎలానూ హాఫ్ డే నే కదా అని హాస్పిటల్ పక్కనే ఉండే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అత్త చెప్తున్నవిషయాలు వింటుంటే ముందు ఆశ్చర్యం, తర్వాత బాధ వచ్చాయి.

ఏంటో కొంత మంది మనుషులని చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు మంచి స్థితి లో ఉన్నవాళ్ళకి మొన్న మొన్నటి దాకా ఇదే మనుషుల మధ్య లో మేము కూడా ఉన్నాం అనే విషయం గుర్తు ఉండదు అనుకుంటా. నిజం చెప్పాలి అంటే మేము కూడా ఏమీ లేనివాళ్ళమే..ఏదో చదువుకుని, ఉద్యోగాలు చేసుకుంటూ ఇలా నడుపుతున్నాం. కానీ మాకు డబ్బు విలువ తెలుసు, ఆ డబ్బు సంపాదించడానికి పడ్డ కష్టం విలువ తెలుసు, అది లేనప్పుడు సాయపడ్డ కావాల్సిన వాళ్ళ విలువ అంతకంటే ఎక్కువ తెలుసు. కానీ ఇప్పుడు మా అత్త చెప్తున్న వాళ్ళని నేను కూడా చూస్తున్నాకదా..వాళ్ళు ఏంటో వాళ్ళకి అసలు కష్టం అంటే ఏంటో తెలియనట్లు, పుట్టిన దగ్గర నుంచీ డబ్బు నే తింటూ, తాగుతూ పెరిగినట్టు, ఎవరి సాయం తీసుకోకుండానే ఈ స్థితి కి వచినట్లు(నేను చెప్తుంది డబ్బు సాయం గురించి మాత్రమే కాదు, మానసిక స్థైర్యం అంటారే దాని గురించి కూడా) ఈ రోజు ఇలా ఉన్నాం కదా అని ఇంతకు ముందు అండగా ఉన్నవాళ్ళని కించపరుస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే మొదట్లో కొంచెం కోపం వస్తుంది, తర్వాత బాధ అనిపిస్తుంది కానీ చివరికి జాలి వేస్తుంది. ఒక్కప్పుడు ఏమీ లేకపోయినా మనస్పూర్తిగా వాళ్ళ మంచి కోరే మనుషుల మధ్య ఉండేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు అన్నీ ఉన్నా చేజేతులా అయిన వాళ్ళని బాధ పెట్టి దూరం చేసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి అది ఈ రోజు కాకపోయినా రేపు ఆయినా అర్ధం అవుతుంది, ప్రాబ్లం ఏంటి అంటే అది వాళ్ళకి అర్ధం అయ్యేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. గాజు వస్తువు అనేది విరగనే కూడదు , విరగటం అంటూ అయ్యాక ఎంత ప్రయత్నించి అతికించినా ఆ పగులు కనిపిస్తూనే ఉంటుంది, కనపడకపోయినా మనసుకి తెలుస్తూనే ఉంటుంది.

1 comment:

Sirisha said...

correct ga chepparu renu...same boat :)